- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. భార్య అలిగి వెళ్లిందని అత్త పై కత్తితో దాడి
by Jakkula Mamatha |
X
దిశ,పల్నాడు: అలిగి వెళ్లిన భార్య ఆచూకీ చెప్పడం లేదని అత్త పై ఆగ్రహించిన అల్లుడు ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన సత్తెనపల్లి రంగా కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగా కాలనీకి చెందిన పూర్ణ, భారతి ఇద్దరు దంపతులు. తాగుడుకు బానిసైన పూర్ణ గత కొంత కాలంగా భార్య భారతిని వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో భార్య ఆచూకీ చెప్పాలని పూర్ణ అత్త కరుణతో గొడవ పడ్డాడు. మాట మాట పెరగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అల్లుడు పూర్ణ అత్త కరుణ పై కత్తితో దాడి చేశాడు. దాడిలో అత్త కరుణ శరీరంపై మూడు చోట్ల బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సత్తెనపల్లిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story