ఎల్లుండి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు: Kollu Ravindra

by Mahesh |   ( Updated:2024-10-14 14:30:04.0  )
ఎల్లుండి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు: Kollu Ravindra
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 షాపులకు సంబంధించిన నూతన లైసెన్సుల ప్రక్రియ ఈ రోజు పూర్తయింది. 89,882 దరఖాస్తులకు సంబంధించిన నెంబర్లతో ఈ రోజు డ్రా తీశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన డ్రా పద్దతి.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయింది. కాగా దీనిపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం.. వైన్ షాపులకు సంబంధించిన నూతన లైసెన్సులను పారదర్శకంగా కేటాయించామని చెప్పుకొచ్చారు. అలాగే 3,396 షాపులను డ్రా ద్వారా కేటాయించామని, 16వ తేదీ నుంచి షాపుల యజమానులు(డ్రాలో పేరు వచ్చిన వారు, లైసెన్స్ పొందినవారు) ప్రారంభించుకోవచ్చని చెప్పుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిందని, రాష్ట్ర ప్రజలకు నాసిరకం మద్యం అందించి.. వారి ప్రాణాలతో ఆడుకున్నారని విమర్శించారు. అలాగే తాము నూతన మద్యం పాలసీలో భాగంగా.. పక్క రాష్ట్రాల బ్రాండ్లను కూడా ప్రమోట్‌ చేస్తామని, రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని, ప్రభుత్వంపై నమ్మకం తోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని ఏపీ ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed