- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Markets: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఇంట్రాడేలో 82,072.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్(Sensex) చివరికి 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 163.73 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.
లాభాలో ముగిసిన షేర్లు : టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, విప్రో, ఎల్అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, మారుతీ సుజికీ, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్లే ఇండియా