Congress party : కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేశ్వర్ గౌడ్..

by Sumithra |
Congress party : కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేశ్వర్ గౌడ్..
X

దిశ, మాక్లూర్ : భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన బోర్గాం మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఈయనకు పేరుంది. గతంలో తెదేపా, కాంగ్రెస్ లలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో ఉన్న సాన్నిహిత్యంతో తిరిగి హస్తం గూటికి చేరారు. గ్రామ అభివృద్ధి ఆకాంక్షించే తనకు పదవుల పై వ్యామోహం లేదని తెలిపారు. పార్టీ నాయకుల సహకారంతో తమ గ్రామానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed