పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-05-21 08:02:54.0  )
పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్న నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని మోడీ కాదని.. భారత రాష్ట్రపతి ప్రారంభించాలని అన్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి రోజైన మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం భారత దేశ నిర్మాతలకు అవమానకరమన్నారు. దేశంలోని విపక్షాలను బీజేపీ అణగదొక్కుతుందని రాహుల్ ఫైర్ అయ్యారు.

ఇక, ప్రధాని మోడీ పార్లమెంట్ భవనం ప్రారంభించడంపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాడానికి ప్రధాని మోడీ ఎవరని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ స్పీకర్ ప్రారంభించాలన్నారు. అలాంటిది ప్రధాని మోడీ ప్రారంభించడం ఏంటని నిలదీశారు.

Also Read...

నాన్న నువ్వు నాతోనే ఉన్నావు: రాహుల్ గాంధీ

Advertisement

Next Story

Most Viewed