సారూ దయ చూపించండి..

by Sumithra |
సారూ దయ చూపించండి..
X

దిశ, నిహమాబాద్ సిటీ : పట్టణంలోని గిరిరాజు కళాశాలలో ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు జీజీ కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా తిప్పించుకుంటుంది. విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం వెళితే ఫీజు రిటర్న్ రాలేదని ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానని జీజీ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. దీంతో విద్యార్థులు ఏఐపీఎస్ యూ సంఘాన్నిఆశ్రయించగా వారు ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

అనంతరం నాయకురాలు జ్వాలా మాట్లాడుతూ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్ జీజీ కళాశాల ప్రిన్సిపాల్ కు పోన్ చశారన్నారు. కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలమేరకు కచ్చితంగా ఫీజులు కట్టించాలని, ఫీజులు కట్టని పక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీచేశారని ప్రిన్సిపాల్ చెప్పటం ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు. విద్యార్థుల కళాశాల బయట బిక్కు బిక్కుమంటూ కూర్చున్నా సర్టిఫికెట్లు ఇవ్వబోమని ప్రిన్సిపాల్ మాట్లాడడం శోచనీయమని అన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed