ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం

by Naresh |
ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
X

దిశ ఆర్మూర్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ శుక్రవారం ప్రారంభం అయింది. ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,పిసిసి ఎన్ఆర్ఐ సెల్ ఛైర్మన్ వినోద్ , ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు ,ఇతర ఎన్నారై విభాగం నేతలతో కలిసి ప్రారంభించారు.

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను ఈ కౌంటర్లో శుక్రవారం స్వీకరించారు. తదనంతరం గల్ఫ్ లో సమస్యల పరిష్కారం కోసం భారీ సంఖ్యలో గల్ఫ్ కార్మికులు వినతి పత్రాలను అందజేశారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

దీంట్లో..ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లినవారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్ గ్రెషియా ఇవ్వడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ విషయం తెలిసిందే. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story