- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మూడు బెల్ట్ షాపులపై పోలీసుల దాడి
దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని చిన్న ఆత్మకూర్, తాండూర్ గ్రామాలలో ఆదివారం మూడు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేసి 89 బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం చిన్న ఆత్మకూర్, తాండూర్ గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న
సమాచారం మేరకు పోలీసులు బెల్ట్ షాపులపై దాడి చేయగా తాండూర్ గ్రామానికి చెందిన బెస్త ఆంజనేయులు, చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన సందుల పోచయ్య, కోటికే నర్సింలు అనే ముగ్గురు వ్యక్తులు తమ బెల్ట్ షాప్ లలో విక్రయిస్తున్న 29.71 లీటర్ల మద్యాన్ని పట్టుకొని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ, అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు హెచ్చరించారు.