మోత మోగిపోతున్న ఫోన్లు.. రోజులో సగం ఫోన్లు వారివే..

by Aamani |
మోత మోగిపోతున్న ఫోన్లు.. రోజులో సగం ఫోన్లు వారివే..
X

దిశ, గాంధారి : యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అండ్ క్రెడిట్ కార్డు. మీకు కావాల్సినట్లయితే మీకు వచ్చిన మెసేజ్ ను క్లిక్ చేస్తే ఆ లింకు ద్వారా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అటుపై మా సంబంధిత అధికారి వచ్చి సార్ మీ సివిల్ స్కోర్ బాగుంది.... మీకు క్రెడిట్ కార్డు కావాలా లేదా లోన్ కావాలా ఏదైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. అంటూ వారి షాపులకు దుకాణాలకు తిరుగుతున్నారు.

రోజుల్లో సగం ఫోన్లు వారివే...

చాలా ఇంపార్టెంట్ ఫోన్లు వస్తాయి అనుకుంటే చీటికిమాటికి చిరాకు తప్పించే కస్టమర్ కేర్ నుండి ఫోన్లు రావడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజుల్లో ఒక్కసారి చేసి అడిగితే సరిపోదు అన్నట్టు చేసిన వారే పదేపదే ఫోన్లు చేసి విసిగిస్తుంటే పెద్ద చిరాగ్గా ఉందని వినియోగదారులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమైన ఫోన్లు వచ్చిన కస్టమర్ కేర్ వాళ్ళే అనుకుంటున్నాం..

ఎడతెరిపి లేకుండా ఫోన్ అదేవిధంగా మోగుతూ ఉండడంతో ఏ ఇది కంపెనీ కాల్ కావచ్చు అనుకొని చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేయని సందర్భాలు చాలానే ఉన్నాయని ప్రజల ఆరోపణ.... కానీ తీరా మిస్ కాల్ ఎవరిదని చూసుకునే సరికి కంపెనీ కస్టమర్ కేర్ కాల్ కాకుండా ఇంటి నుంచి బంధువు నుంచి వచ్చిన ఫోన్ అయి ఉండడంతో వినియోగదారుడు అర్థం కాక అవాక్కవుతున్నాడు.

ఫిర్యాదు చేసేందుకు కనీసం కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉండదు..

నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డు ఏది వద్దు అని తన నంబర్ కు క్రెడిట్ కార్డ్ సంబంధిత ఇలాంటి ఫోన్లు రాకుండా ఉండాలని కస్టమర్ కేర్ నెంబర్ కూడా అందుబాటులో ఉండదు. కేవలం వారు చెప్పేదే వినాలి తప్ప మనం చెప్పేది వారు వినరు... ఎందుకంటే అవతల మాట్లాడేది వ్యక్తి కాదు ఒక మిషన్.

Advertisement

Next Story

Most Viewed