- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేసీఆర్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మేస్థితిలో లేరని, తొమ్మిది సంవత్సరాల పాలలో ఎంతో మంది అమాయక యువకులను, నిరుద్యోగులను, మహిళలను పేద ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆదివారం నగరంలోని మార్వాడి గల్లీలోని ధన్ పాల్ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ని మేనిఫెస్టోలో నిరుద్యోగులకు అవకాశం లేదా అని ప్రశ్నించారు. సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3 వేల రూపాయలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 3016 ఇప్పటికీ అమలు కాలేదని, మళ్లీ మహిళలను మోసం చేయడానికే రూ.3 వేలు ఇస్తామని మళ్ళీ
కొత్త హామీలతో మోసం చేయడానికి వస్తే ప్రజలు తరిమికొడతారన్నారు. కేసీఆర్ పరిపాలనను ప్రజలంతా విస్మరించారని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకే గూటి పక్షులు అన్నారు. ఇద్దరు ఒకే మేనిఫెస్టో తో ప్రజలను మోసం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. మేనిఫెస్టోలో విద్య వైద్యం గురించి లేకపోవడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. పేదల కోసం వారి అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం మేనిఫెస్టో ను భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు ఉంచుతుందన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైసర్, బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, ఆమందు విజయ్, ఎల్ఎంఎల్ శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.