పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించండి

by Sridhar Babu |
పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించండి
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఒక విద్యార్థికి 25 రూపాయల స్లాబ్ రేటు ఇవ్వాలని,

వంటగ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఏజెన్సీల అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ ఏఓ కి వినతిపత్రం అందించారు. ఈనెల 12వ తేదీ వరకు బిల్లులు చెల్లించని ఎడల 13వ తేదీ నుండి సమ్మెకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయమ్మ, చక్రపాణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి. నర్సింగరావు, నాయకులు పి. హనుమాన్లు, నాగలక్ష్మి స్రవంతి బాలరాజ్, గంగాధర్, విజయలక్ష్మి, నరేష్, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed