dog ​​attacks : కుక్కలకు ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేదా..?

by Sumithra |
dog ​​attacks : కుక్కలకు ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేదా..?
X

దిశ, కోటగిరి : ఆధునిక కాలంలో ప్రపంచంతో పోటీపడి నడుస్తున్నామని ఆనందపడాలో లేక మనుషుల జీవితాలకు వారి ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని అర్ధం కాని అయోమయంగా పరిస్థితి నెలకొంది. ఒకవైపు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ రహదారుల వెంట ఒంటరిగా వస్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అంతేకాకుండా చిన్నారుల పై దాడులు చెసి మరణాలకు కారణం అవుతున్న విధి కుక్కలను చూస్తేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామాలలో విపరీతంగా పెరిగిపోయిన కుక్కల బెడద తగ్గించాలని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల వెనుకంజ..

కుక్కల విడత తగ్గించాలని హైకోర్టు సైతం ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు మొట్టికాయ వేసినా క్రింది స్థాయి అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం పై వెనుకంజ వేస్తున్నారని చెప్పవచ్చు. గతంలో అన్యాయంగా మూగజీవాలను హింసించి చంపుతున్నారని వాటి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న జంతు ప్రేమికుల సంఘాలతో నేడు అధికారులకు తల నొప్పిగా మారింది. కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటే ఎక్కడ జంతు ప్రేమికుల సంఘాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు జంకుతున్నారు.

భయం గుప్పిట్లో చిన్నారుల తల్లిద్రండ్రులు..

గత కొద్దిరోజుల క్రితం కుక్కల దాడిలో చిన్నారుల మరణాలు అని సోషల్ మీడియంలో ఎక్కువగా వైరల్ కావడంతో పాటు ఇటు గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉండడం వల్ల చిన్నారుల తల్లిదండ్రులు భయందోళనకు గురై భయం గుపెట్లో బతుకుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed