- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ కమీషనర్ వస్తున్నాడు.. పదోన్నతుల నేపథ్యంలో ఉత్తర్వులు రేపోమాపో..
దిశ, నిజామాబాద్ క్రైం : గత రెండు నెలల కాలంగా ఎదురు చూస్తున్న నిజామాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు భర్తీకి వేళ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పలువురు అదనపు ఎస్పీలకు పదోన్నతులు ఇచ్చిన విషయం తెల్సిందే. వారికి పోస్టింగ్ లు మాత్రం ఇవ్వలేదు. రేపోమాపో అదనపు ఎస్పీల నుంచి ఎస్పీగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్ లు ఇవ్వడమే తరువాయిగా మారింది. మార్చి 31న నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు పదవి విరమణ చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచి నిజామాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. బాసర జోన్ లోని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అదనపు డీసీపీ (అడ్మిన్) గా ఉన్న మధుసూదన్ రావుకు పదోన్నతి రాగా అతన్ని కూడా హైదరాబాద్ కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ కు కూడా ఏసీపీ నుంచి అదనపు సీపీగా పదోన్నతి రాగా హైదరాబాద్ కు అటాచ్డ్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సౌత్ జోన్ ఐజి నుంచి నిజామాబాద్ కమిషనర్ నియామక ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఇది వరకే ఓకే చేసిన వారికే సీపీగా పోస్టింగ్ ఇస్తున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది.