ఆర్మూర్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

by Shiva |
ఆర్మూర్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
X

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మేమే పోటీ

జీవన్ రెడ్డి నీ కుప్పి గంతులు ఇక సాగవు : టీడీపీ నాయకులు

దిశ, ఆర్మూర్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు శతజయంతి ఉత్సవాల పేరిట తెలుగు జాతి ఆత్మగౌరవానికి వందేళ్లు పూర్తి పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కలిసి ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల ఎమ్మార్ గార్డెన్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేగం యాద గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ముందుగా ఎన్టీఆర్ కూడలి నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ర్యాలీగా ఎం ఆర్ గార్డెన్ కు టిడిపి శ్రేణులు చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్య అతిథి అలీమ్ మస్కతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టిడిపి పార్టీ కోసం పనిచేసి చనిపోయిన నాయకులకు మినీ మహానాడు ప్రోగ్రాం లో నాయకులు సంతాపం తెలియజేశారు.

చాలా రోజుల తర్వాత పార్టీ శ్రేణులలోని కార్యకర్తలు, నాయకులు కలుసుకొని స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేదల పట్ల ఆయన కున్న బాధ్యత గురించి మాట్లాడుకుని నేటి నాయకులలో ప్రజల సంక్షేమం పక్కన పెట్టి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి అలీ మస్కతి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీకి బంగపాటు తప్పదని బలమైన ప్రతిపక్ష పార్టీగా టిడిపి పార్టీ ఉంటుందన్నారు.

ఆనాడు మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలే నేటికీ ఆచరణలో ఉన్నాయన్నారు. కొత్తగా కాంగ్రెస్ , బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి తీసుకు రాలేదని ఎద్దేవా చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత టిడిపి పార్టీ దేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పట్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దే 20 20 విజన్ తో రాష్ట్రాన్ని ఐటి రంగంలో ప్రపంచంతో పోటీపడేటట్టు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరారు.

నాడు చంద్రబాబు నాటిన మొక్కలే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాల రూపంలో రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేని పథకాలతో రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యంలోకి తోసేసిందన్నారు.ఈ కార్యక్రమంలో మినీ మహానాడు పేరిట కొన్ని తీర్మానాలు చేశారు. అందులో కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు భారతరత్న ప్రకటించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించి నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గించాలన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని , సారంగాపూర్ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని ,ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలన్నారు.

పసుపు రైతులకు న్యాయం చేసే విధంగా పసుపు బోర్డును ఏర్పాటు చేసి క్వింటాలుకు 15 వేల మద్దతు ధర ఇప్పించాలన్నారు. జిల్లా కేంద్రంలో లెదర్ పార్కుకు శంకుస్థాపన చేయాలని, నందిపేట్ మండలం లక్కంపల్లి సెజ్ లో వ్యవసాయధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అంతకు ముందు టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మైనారిటీ నాయకులు టీడీపీ సిద్ధాంతాలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వగా, వారికి ముఖ్య అతిథి అలీమ్ మస్కతి పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story