- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజామాబాద్‌లో పోలీసుల వసూళ్ల దందా..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వైట్ కాలర్ నేరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లలో ఎస్ఐలు కట్టడి చేయకపోతుండటంతో వారు నిర్వహకులతో లాలూచి పడి కేసు పెట్టడం లేదని దానిని అరికట్టేందుకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక పోర్స్‌ను ఏర్పాటు ప్రక్రియ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో అలాంటి వ్యవస్థ పోలీస్ కమిషనరేట్ చేసినప్పుడు ఏర్పాటు చేశారు. దానిలో పని చేసే అధికారులకు పోలీస్ బాస్ అదేశాల మేరకు పని చేస్తుంటారు.
సమాచారం వచ్చిందే తడువుగా దాడులు నిర్వహించి సంబంధిత వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లలో అప్పగిస్తే అక్కడ ఎఫ్ఐఆర్‌లు చేయడం సాధరణంగా జరిగే అంశం. కొన్ని సార్లు స్థానిక పోలీస్ లతో కలిసి దాడులు నిర్వహించడం లాంటిది జరుగుతుంది. ప్రత్యేక టీం ద్వారా జిల్లాలో చాలా అరుదైన కేసులు చేదించిన ఘనత ప్రత్యేక టీం సాధించింది.
కానీ గత కొన్ని నెలలుగా ప్రత్యేక టీంపై కాసుల వసూళ్ల దందా పై విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో పని చేసిన మాజీ అధికారి పేరు చెప్పి ప్రస్తుతం పనిచేస్తున్న ఒక అధికారి వసూళ్ల పర్వానికి తేరలేపాడని ఆరోపణలు ఉన్నాయి. అధికారి తీరుతో ఇప్పుడు స్పెషల్ టీంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దాడులకు వెళ్లడం అంటే ఎక్కడ వసూళ్ల మకిలి తమకు అంటుకుంటుందో అని భయపడిపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి సీపీ సైతం మెట్టి కాయలు వేసిన తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ స్పేషల్ పోర్స్ దాడులు జాడ లేకపోవడం వేనుక సంబంధిత అధికారి మామూళ్లు మాట్లాడుకోవడంతోనే తనిఖీలు లేవని విమర్శలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అధికారి పేరు చెప్పి చివరకు ల్యాండ్ సెటిల్మెంట్‌లు పంచాయతీలు చేశారనే ఆరోపణలు ముటగట్టుకున్నారు.