- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ జిల్లా ఇంచార్జ్ పై రాళ్ల దాడి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇంచార్జ్ మీసాల చంద్రయ్య వెళ్తున్న వాహనంపై నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొని హైదరాబాద్ కు తిరిగి వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కాంలో ఈడి నోటీసులు రావడంతోనే టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సంఘటన స్థలాన్ని బీజేపీ జిల్లాఅధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, ఇతర నాయకులు పరిశీలించారు. ఈ ఘటనలో మీసాల చంద్రయ్యకు గాయాలు కాకపోయినా రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లిక్కర్స్ స్కాంలో కవిత కు ఈడి నోటీసులు జారీ నేపథ్యంలో పోలీసులు నిజామాబాద్ లో బందోబస్తు చర్యలు చేపట్టగా నగర శివారులో ఈ దాడి జరగడం గమనార్హం.