- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
దిశ, కామారెడ్డి : యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగా భవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగ ఉత్తమమైన సాధనం అన్నారు. మానవులు ఉదయం లేవగానే మంచి ఆలోచనలు రావడానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని తెలిపారు.
ఎలాంటి వ్యాధులు దరిచేరవని సూచించారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, యోగా గురువులు అంజయ్య, రామ్ రెడ్డి, అనిల్ కుమార్, అంతిరెడ్డి వివిధ రకాల ఆసనాలు చేశారు. కామారెడ్డి పట్టణంలో ఉచితంగా యోగ శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువలతో సన్మానించారు. జిల్లా టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి బి.సాయిలు, జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు రఘు కుమార్, అంజయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక జీవన విధానంలో భాగంగా యోగా.. బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగా కామారెడ్డి పట్టణంలోని 34వ వార్డు పరిధిలో ఆర్యసమాజ్ మందిర్ లో ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ మీనన్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో యోగా ఒక భాగం అని అన్నారు. శతాబ్దాల కాలం నుండి యోగా ప్రాచుర్యంలో ఉన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కృషి వల్లే యోగాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగ ప్రకటించడంలో కూడా మోది కృషి ఫలితమే అని అన్నారు. రోజు యోగాతో సర్వ రోగాలకు దూరంగా ఉండొచ్చు అని సూచించారు.