- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలు అందించాలి..
దిశ, మాచారెడ్డి : అటవీ భూములను బ్రతుకుదెరువు కోసం సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందించాలని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు లోయపల్లి నర్సింగరావు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పోడుభూముల పట్టాల పరిశీలనను ఆయన గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామపంచాయతీలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు తీర్మానం చేసిన పోడుభూముల పట్టాలను పూర్తిస్థాయిలోఅందించాలన్నారు. చాలా కుటుంబాలు పోడుభూములను ఎన్నో ఏళ్ల నుంచి సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నారని ఆ కుటుంబాలు ఈ పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ రామ్మోహన్, ఎంపీటీసీలు రాజేశ్వర్, శ్రీనివాస్, రేనాచంద్రు నాయక్, రైతు సమితి అధ్యక్షులు నర్సింలు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.