- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కలెక్టర్ రాకతో అధికారుల్లో చలనం
దిశ,నిజాంసాగర్: రాజొచ్చే కథ మొదలైదన్న చందంగా మారింది నిజాంసాగర్ ప్రస్తుత ఆసుపత్రి పరిస్థితి. ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేయకపోగా జిల్లా ఉన్నత అధికారి వస్తున్నాడు అంటే ఆసుపత్రిలో హుటాహుటిన పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో బ్లీచింగ్ చేస్తూ, వ్యర్థ పదార్థాలను ఆఘాల మేఘాల మీద తొలగిస్తున్నారు. అధికారులు వస్తే తప్ప ఆసుపత్రి సిబ్బందికి శానిటేషన్ పై ఎంత శ్రద్ధ ఉందో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
ఈ అధికారుల అతి ఉత్సాహం రోజు ఈ విధంగానే ఉంటే ఆసుపత్రికి వచ్చే రోగులు ఎంతగానో సంతోషిస్తారని పలువురు అనుకుంటున్నారు. అధికారులు వస్తే తప్ప ఉద్యోగం ఉన్న సంగతి గుర్తుకు రాని అధికారులు ఎందరో ఉన్నారని మండలంలో సైతం విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆసుపత్రి పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి నిరంతరం ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.