- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Power war: బండి సంజయ్‌కు ఎమ్సెల్సీ కవిత సవాల్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఆమె ఛాలెంజ్ చేశారు. అలాగే కరీంనగర్‌లో కరెంట్ కష్టాలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కరీంనగర్‌లో కరెంట్ తీగలు పట్టుకోవాలన్నారు. అప్పుడు కరెంట్ ఉందో లేదో తెలుస్తోందని కవిత ఎద్దేవా చేశారు. తాను నిజామాబాద్‌ను, తెలంగాణను వదిలి ఎక్కడికీ పారిపోలేదని, వచ్చే ఎన్నికల్లో అరవింద్‌ను కచ్చితంగా ఓడిస్తామని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.
మరికొన్ని నెలల్లో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎలాగైనా గెలిచేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు చేస్తున్నాయి. దీంతో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో తమపై గెలవాలని పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.