- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిట్టింగుల్లో టెన్షన్..ఈ సారి అవకాశం ఇస్తారా..? లేదా..?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ వస్తుందా... రాదా అనే ఆందోళన పట్టుకుంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ వేదికగా చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ తెచ్చి పెట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించుకోవాలని అక్టోబర్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహులకు, వారసత్వ టికెట్ ల పై ఆశలను పెట్టుకున్న వారికి అశనిపాతమైంది. సీఎం ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలను నిర్వహిస్తు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి జిల్లాలో గడిచిన ఎన్నికల్లో 8 బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సైతం డెవలప్మెంట్ కోసం అంటూ బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు, వారసులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పోటీ కోసం చాలా మంది బరిలో ఉన్నారు. ఇటీవల చివరగా నామినేటేడ్ పోస్టుల భర్తీతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్సీ గడువు ముగియడంతో వారంతా ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ లపై ఆశలు పెట్టుకున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి, రెండు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆశావహుల సంఖ్య గణనీయంగా ఉంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన వరకు కూడా తమకే టికెట్లు వస్తాయని ధీమాతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన వారు కూడా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ లో మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత స్టేట్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. కుల సంఘాల సమావేశాలు అర్బన్‌లో చురుకుగా పని చేసుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్‌లో తాజామాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో పాటు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి లు బీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్నారు. బోధన్ లో షకీల్ ఆమెర్ తనకు టికెట్ రాని పక్షంలో తన భార్యకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు.
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వాలని జాతీయ రాజకీయాలు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపారు. అయితే కేసీఆర్ ఇటీవల కాలంలో షకీల్ ఆమెర్ మధ్య సంబంధాలు అంతగా లేవని చెప్పాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్ విఠల్ రావు, బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ సాగర్ రావులు టికెట్ ను ఆశిస్తున్నారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్ కు నిట్టూ వేణుగోపాల్ రావు, ముజిబుద్దీన్, లోయలపల్లి నర్సింగ్ రావులు నుంచి టికెట్ కోసం పోటీ ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు ఘర్ వాపస్ భయం పట్టుకుంది.
గతంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలోకి తీసుకుంటున్నారని ఆయనకే గెలిచే అవకాశాలు ఉన్నాయని, టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ రావు టికెట్ ను ఆశిస్తున్నారు. తన పదవీ కాలం ముగిసే సమయానికి రెన్యువల్ చేయకపోతే కచ్చితంగా అక్కడ పోటీ చేస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. మిగిలిన రెండు నియోజకవర్గాలైన బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించే స్థాయిలో లీడర్లు ఎవరు లేరు.
ప్రస్తుతానికి సిట్టింగ్ లకే టికెట్లను ఇస్తామని, కొత్త వారికి టికెట్లను ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటన ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాల సిట్టింగ్ లకు కొంత నైరాశ్యం నింపింది. గడిచిన 2018లో జరిగిన ఎన్నికల్లో తమ వారసులను పోటీలో నిలపాలని ఆశించిన సీఎం కేసీఆర్ ఆనాడు కూడా సిట్టింగ్‌లకే కన్ ఫాం చేయడంతో తప్పనిసరిగా పోటీ చేసి గెలుపొందారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో వారసులను నిలపాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు గత ఎన్నికల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమకున్న ఆరోగ్య సమస్యలు, వయస్సు రీత్యా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పటికే బాన్సువాడ, రూరల్ నియోజకవర్గాల్లో వారి వారసులు వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు వస్తాయని నియోజకవర్గాలను చుట్టేశారు. బోధన్ లో సైతం షకీల్ అమెర్ తన సతీమణికి టికెట్ కోసం గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదని పలుమార్లు షకీల్ అమెర్ అలిగారు కూడా. దీంతో పాటు తనకు కేసీఆర్ ఆఫర్ చేసిన విప్ పదవిని స్వీకరించలేదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే టికెట్లు అనడంతో వారసులను ఎమ్మెల్యేలను చేద్దామనుకున్నా ముగ్గురు లీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ నాటికైనా తమ వారసులకు టికెట్ల విషయంలో కేసీఆర్ ను ఒప్పించాలని ప్రయత్నించే పనిలో పడ్డారు.