- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మీని వాకథాన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మెడికవర్ హాస్పిటల్స్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గురువారం "మినీ వాకథాన్" ను నిర్వహించారు. మిని వాకథాన్ ను నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కేఆర్ నాగరాజు జెండా ఊపి 4 కిలోమీటర్ ల వాకింగ్ ను ప్రారంభించారు. వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ నుండి కలెక్టరేట్ సర్కిల్ వరకు " యూస్ హర్ట్ ఫర్ ఎవ్రీ హర్ట్ " అనే నినాదంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలు అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇటువంటి అవగాహనా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం అని అన్నారు.
రోజూ వృత్తి పరమైన ఒత్తిడికి గురి కాకుండా నిత్యం వ్యాయామం కాలి నడకకు ప్రాధాన్యత నిచ్చి అట్లాగే 50సంవత్సరాలు పైబడి వున్న ప్రతీ వ్యక్తి గుండె పరీక్షలు నిర్వహించుకుని ఆరోగ్యానికి ప్రధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు గుండె పై వత్తిడిపడకుండా చూసుకోవడం మంచిదని అన్నారు. అనంతరం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. రవి కిరణ్ మాట్లాడుతూ గుండెపోటు కు గల కారణాలు శరీరక శ్రమ లేకపోవడం, వంశపారాంపర్యంగా గుండె వ్యాధులు ఉండడం, ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకుండటం, సిగరెట్, ఆల్కహాల్ వంటి దురవ్యాసనాలు వున్నవారు తగు జాగ్రత్తలు తీసుకొని జీవనశైలిలో మార్పులతో గుండెను కాపాడుకోవచ్చని తెలియజేసారు.
గుండెవ్యాధి నిపుణులు డా. సందీప్ మాట్లాడుతూ గుండె వ్యాదులను గుర్తించి సరైన సమయంలో హాస్పిటల్ కి వెళితే మనం ఎలాంటి స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాం అన్నారు. గుండె ఆరోగ్యాన్ని సమీక్షించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా ఉండొచ్చు అన్నారు. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలి దీనివల్ల ఒత్తిడి అండ్ డిప్రెషన్ తగ్గుతుంది అని తెలియజేసారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో డా. అవీన్, డా. విద్యాసాగర్, డా శ్రీనివాస్ , డా.వాను, డా. కళ్యాణ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి, లహరి సిబ్బంది పాల్గొన్నారు.