- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భీంగల్ సీఐ ఎస్ఐల దౌర్జన్యం నశించాలంటూ.. ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట స్వర్ణకారుల ధర్నా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీంగల్ సీఐ, ఎర్గట్ల ఎస్సై ల వేధింపుల నుంచి బంగారు వ్యాపారిని కాపాడాలని వర్తకులు ఆందోళన దిగారు. సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి కు చెందిన బంగారు వర్తకులు తమ షాపులను మూసివేసి నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మెట్పల్లి చెందిన బంగారు వ్యాపారి ఇందూరి రమణ ను ఏర్గట్ల పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని అరెస్టు చేయకుండా కేసులు నమోదు చేయకుండా డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని సీఐ ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏర్గట్ల కు చెందిన భరత్ అనే చోరి కేసులో దొరికిన వ్యక్తి ఇందూర్ రమణకు దొంగ బంగారం విక్రయించాడని పోలీసులు ఆరోపిస్తున్నారని తెలిపారు.
ఈ విషయంలో బంగారంకు సంబంధించిన సొమ్ము మూడున్నర లక్షల ఆన్లైన్ పేమెంట్లు, మరో 50,000 నగదు రమణ చోరీసొత్తును విక్రయించిన భరత్ కూ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పది లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో భీంగల్ సీఐ ఏర్గట్ల ఎస్సైలు నాలుగు రోజులుగా రమణను వేధిస్తున్నారని వాపోయారు. చోరీ సొత్తు కేసులో పోలీసులకు సహకరిస్తామని బాధితులు దొంగకిచ్చిన సొమ్ము వివరాలను చెప్పిన అదనంగా ఇవ్వాలని వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఉన్నతాధికారులు కూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పోలీస్ స్టేషన్ ఎదుట బంగారు వర్తకులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. పోలీస్ శాఖలో చోరీ కేసులో సొత్తు రికవరీ కాసులు కురిపిస్తుంది అని వ్యవహారం బంగారు వర్తకుడు వేధింపులతో బట్టబయలైంది.