- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దవాగులో ఇసుక తోడేళ్ళు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెద్దవాగు అంటేనే ఇసుక వ్యాపారులకు లక్ష్మి కటాక్షం వరించినట్లే. గుట్టు చప్పుడు కాకుండా వాగుని తవ్వుకొని లక్షలు సంపాదించవచ్చు. వాగు నిండుగా పారితే రైతుల ఆనందం అనే మాట దేవుడెరుగు... కానీ ఇసుకాసురులకు మాత్రం లక్ష్మీ దేవి కాసులు కురిపించినట్లే. ఇంకేముంది గత ఏడాది భారీ వర్షాలకు పెద్దవాగులో ఇసుక తెట్టెలు వేశాయి. దీనిపై ఏన్నో రోజుల నుండి కన్నేసిన అధికారపార్టీ ఇసుకాసురులు తమ అధికార బలాన్ని ఉపయోగించి ఇసుక దోపిడీకి తెరలేపారు. రోజంతా వాగులో ఇసుకను తవ్వి గ్రామానికి సమీపంలో డంపింగ్ చేసి రాత్రి పూట టిప్పర్ లలో తరలిస్తున్నారు. లక్షలాది రూపాయల ఇసుకను మైదాన ప్రాంతాలకు తరలించి సోమ్ము చేసుకుంటున్నారు. రాత్రయిందంటే చాలు జాతీయ రాహదారి మొదలుకోని మండలలో పెద్ధ వాగు ఇసుక తరలిపోతుంది.
రాష్ర్ట రోడ్డు భవనాల, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కోండ నియోజకవర్గంలోని సావేల్ గ్రామ పరిధిలోని పెద్ధవాగులో ఇసుక తోడేళ్లు రెచ్చిపోతున్నారు. రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరించే వీడీసీ అధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో రూ.17 లక్షలకు దక్కించుకున్న అదేగ్రామానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక మాజీ లే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారుల. తమ అంగ, ఆర్థిక బలాన్ని ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తు లక్షల్లో సంపాదన మొదలెట్టారు. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ ముగ్గురు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి జేబులు నింపుకుంటున్నరు. దీంతో పెద్దవాగులో ఇసుక తెట్టెలు కనుమరుగవుతున్నాయి. వాగులో వాహనాలు నడిచేందుకు వీలుగా రోడ్లు ర్యాంపును సైతం నిర్మించారు.అధికార పార్టీ నాయకుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.
మెండోరా మండలం పెద్దవాగుని నమ్ముకొని దాదాపు 20 గ్రామాల్లో రైతులు పైపులైన్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. సూమారు 15 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి ఎడాధి కురిసే వర్షాలకు పెద్ధవాగు నిండుకుండాల ప్రవహిస్తుంది. అయితే వానకాలం ముగిసిన తరువాత నీటి జాడలు కరువైతాయి. దానిని పరిగణలోకి తీసుకుని వెల్గటూర్ వద్ధ చెక్ డ్యాంకు ప్రతిపాధనలు చేయ్యగా అది మంజూరు అయింది . కాని ఇవేమి పట్టని ఇసుకసురులు ఇటివల వర్షాకాలంలో కురిసిన వానతో వేసిన ఇసుక మేటలను తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు..
ఒక వైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం పెద్దవాగు లో నీటి నిల్వలు పెరిగేలా చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాల పెంపు కోసం కృషి చేస్తున్నారు.ఇవేమీ పట్టని ఇసుకాసురులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూస్తారా లేదన్నది చర్చనీయాంశంగా ఉంది.ఇప్పటికైనా అధికారులు ఇసుక రవాణా కు అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు ఇంకిపొకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవిన్యూ, పోలిస్ శాఖలు ఇప్పటికి ఇసుక సురుల వేంట ఉన్నారని విమర్శలు ముటగట్టుకున్నారు.