- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్.. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహాత్మ గాంధి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
మహాత్ముని స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తూ...గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంస్ చైర్మన్ సాంబరి మోహన్, డిచ్ పల్లి జెడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ , నిజమాబాద్ రూరల్ మడలం ఎంపీపీ అన్నం సాయిలు మండల పార్టీ అధ్యక్షులు, మధుకర్ రావు, మహిపాల్ యాదవ్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.