మంత్రి రేస్ లో మదన్మోహన్

by Sumithra |
మంత్రి రేస్ లో మదన్మోహన్
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన కే మదన్మోహన్ రావ్ కు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో సోమవారం ముఖ్యమంత్రితో పాటు, మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు మదన్మోహన్ రావ్ వర్గీయుల నుంచి విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి జాజల సురేందర్ పై 24,334 ఓట్ల ఆధిక్యంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మదన్ మోహన్ కు మంత్రివర్గంలో యే శాఖ లో చోటు దక్కుతుందో అని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కార్యకర్తలు తర్జనభర్జనలు అవుతున్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి, లేదా రెవిన్యూ శాఖ నుంచి మదన్ మోహన్ కి మంత్రివర్గంలో చోటు దక్కాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story