ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

by Sridhar Babu |
ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త ధర్నా లకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలకు దిగాయి. బుధవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తూ నగర మేయర్ దండు నీతు కిరణ్, జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్, సుమ నారెడ్డి, ధర్పల్లి జెడ్పీటీసీ బాజీరెడ్డి జగన్, బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూకిరణ్ ,బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రె స్ మంత్రులు ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బు లు దోపిడీ చేస్తున్నారో చెప్పా లని డిమాండ్‌ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed