మండల బాస్ పై బదిలీ అస్త్రానికి ప్రయత్నం..

by Sumithra |
మండల బాస్ పై బదిలీ అస్త్రానికి ప్రయత్నం..
X

దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాదిన్నరగా ఇంచార్జ్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ రెడ్డి పై రాత్రికి రాత్రే బదిలీ అస్త్రం ప్రయోగించడం కోసం ప్రయత్నాలు జరుగుతుండడంతో ఇప్పుడు ఇది ఉమ్మడి మండలంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎంపీడీవోగా పనిచేసిన అజారుద్దీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఎంపీడీవో స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఎడపల్లి మండల కేంద్రంలో సూపర్డెంట్ గా పనిచేస్తున్న మనోహర్ రెడ్డిని ఇక్కడ ఇంచార్జ్ ఎంపీడీవోగా నియమించారు.

సాధారణ బదిలీలు జరుగుతున్న సమయంలో కోటగిరి మండలానికి రెగ్యులర్ ఎంపీడీవోగా రావడం కోసం అంతగా ఎవరు ఆసక్తి కనపరచినప్పటికీ ఒక్కరోజులోనే అంతా తారుమారయింది. ఇంచార్జ్ ఎంపీడీవో మనోహర్ రెడ్డిని బదిలీ చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం వెనుక ఉమ్మడి మండలానికి చెందిన ఒక మాజీ ప్రజా ప్రతినిధి హస్తం ఉందని కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. తమ బాసును బదిలీ చేసి ఆస్థానంలో మరొకరిని ఇన్చార్జి ఎంపీడీవోగా నియమించడం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని క్రింది స్థాయి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. బదిలీ కోసం కొందరు ప్రయత్నం చేయడం దానిని ఆపడం కోసం మరికొందరు ప్రయత్నం చేయడంతో ఇది ఉమ్మడి మండలంలో హాట్ టాపిక్ గా మారడంతో ముందు ముందు జరిగే ఆసక్తికరమైన పరిణామం కోసం ఉత్కంఠగా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed