- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లింబాద్రి గుట్ట జాతరకు పటిష్ట బందోబస్తు
దిశ, భీమ్ గల్ నవంబర్ 13: లింబాద్రి గుట్టలింబాద్రి గుట్టపై జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు భక్తులు సహకరించాలని భీమ్ గల్ సీఐ పులిగిల్ల నవీన్ కోరారు. బుధవారం భీమ్ గల్ పోలీస్ స్టేషన్ లోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండపై ఈనెల 15 న జరిగే స్వామి వారి రథోత్సవం,జాతర బందోబస్తుకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇంచార్జి సీపీ,ఆర్మూర్ ఏసీపీల ఆదేశానుసారం జాతర బందోబస్తుకు అధిక సంఖ్యలో పోలీసు బలగాలను వినియోగిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ ఐలు, మూడు వందల మంది పోలీస్ సిబ్బందిని జాతర బందోబస్తు కోసం వినియోగిస్తున్నామన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు, ఈవ్ టీజింగులు జరగుకుండా నియంత్రించేందుకు కొండపైన, కొండ దిగువ ప్రాంతం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా అవసరమైన చోట్ల 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటర్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. జాతరలో ఎవరేం వెకిలి వేశాలు వేసినా, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా సీసీ ఫుటేజీ ద్వారా బాధ్యులను గుర్తించేందుకు వీలు కలుగుతుందన్నారు. జాతర రోజు గుట్టపైకి ఎలాంటి ద్విచక్ర వాహనాలను, ఫోర్ వీలర్స్ ను అనుమతించడం లేదన్నారు. వాహనదారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ లోనే వాహనాలను పార్క్ చేసి కొండపైకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో పోలీసులకు భక్తలు సహకరించాలన్నారు.
జాతరలో భక్తుల సేవల కోసం ఆరు అవుట్ పోస్టులు
జాతరలో ప్రజలకు అవసరమైన పోలీస్ సేవలు అందించేందు కోసం కొండపైనా, కొండ దిగువన అక్కడక్కడా ఆరు అవుట్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దీంతో పాటు జాతరలో పరిస్థితిని ఎప్పకప్పుడు తెలుసుకునేందుకు ఐదు పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు కలిగేలా దుకాణాలు ఏర్పాటు చేయవద్దని సీఐ అన్నారు. దుకాణాలేవీ కూడా బీటీ రోడ్డు పైదాకా ఏర్పాటు చేయొద్దన్నారు.
ఎమర్జెన్సీలో మాకు కాల్ చేయండి
భక్తులకు ఏదైనా పోలీసు అవసరం కావాల్సి వచ్చినా, ఎమర్జెన్సీ సమస్యలు ఎదురైతే డయల్ 100 కు కాల్ చేయాలని సీఐ తెలిపారు. దీంతో పాటు భీమ్ గల్ సీఐ 8712659865, ఎస్ ఐ 8712659866 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. జాతరలో వేలాది మంది భక్తులు హాజరయ్యే జాతరలో దొంగలు కూడా సంచరిస్తారని, దొంగతనాలు జరిగే అవకాశాలున్నందున మహిళలు విలువైన ఆభరణాలు ధరించి రావొద్దని సీఐ నవీన్ మహిళలకు సూచించారు. మహిళల రక్షణ, వారికి సేవలు అందించడం కోసం షీ టీంలను, మఫ్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. దర్శనం సమయంలో తొక్కిసిలాట కాకుండా భక్తులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. క్యూ లైన్లలో భక్తులు క్రమపద్ధతిని పాటించాలన్నారు. పోలీసులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. భక్తులు జాతరలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిచయం లేని వ్యక్తులు కానీ, మహిళలు కానీ పలకరించి బుట్టలో వేసి మోసం చేసే అవకాశాలుంటాయన్నారు. వారి బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఏవైనా వస్తువులు కానీ, వ్యక్తులు కానీ కనిపించినా వెంటనే సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ లో తెలియజేయాలని కోరారు. పోలీసులకు ఫోన్ చేసి కూడా సమాచారం ఇవ్వొచ్చన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఐ నవీన్ వివరించారు. సమావేశంలో సీఐ నవీన్ తో పాటు ఎస్ ఐ మహేశ్, పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.