- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లింబాద్రి గుట్ట జాతర ప్రత్యేక బస్సులు
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమగల్ శివారులోని లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం గుట్టకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కే. జానిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 17 వరకు ఆర్మూర్, నిజామాబాద్, ధర్పల్లి, సిరికొండ ల నుంచి లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. సురక్షిత, సుఖవంతమైన ఆర్టీసీ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఆర్ఎం జానిరెడ్డి రీజినల్ పరిధిలోని ప్రజలను కోరారు. సుఖవంతమైన ప్రయాణంతో ప్రయాణీకులు తమ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని ఆర్ఎం ఆకాంక్షించారు