పొంగిపొర్లుతున్న సింగీతం మత్తడి..

by Sumithra |
పొంగిపొర్లుతున్న సింగీతం మత్తడి..
X

దిశ, నిజాంసాగర్ : మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం మత్తడి ఆదివారం పొంగిపొర్లింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సింగీతం రిజర్వాయర్ నీటిమట్టం 416.550 మీటర్లు కాగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన వర్ని మండలం బడపహాడ్ (పెద్దగుట్ట) పరిధిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 5000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది.

దీంతో ప్రాజెక్ట్ ఉదయం వరకే 416.550 మీటర్లు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిండడంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువ మొత్తంలో 4000 క్యూసెక్కులు మత్తడి పై నుంచి వృధాగా వాగులోకి వెళ్లిపోగా 1000 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వర్షాభావంతో వాగులు, వంకల్లో కూడా వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు, రైతులు ఎవరు నీటి ప్రవాహంలోకి, కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed