- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫిబ్రవరి 24న దివంగత నేత యాల్ల రాములు విగ్రహావిష్కరణ..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ కు చెందిన దివంగత నేత యాల్లరాములు విగ్రహావిష్కరణను ఈనెల 24వ తేదీన శుక్రవారం ఆలూరు బైపాస్ రోడ్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి చేయనున్నారు. దివంగత నేత యల్ల రాములు 1960 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన యాళ్ల భూమన్న- చిన్ను భాయ్ దంపతులకు జన్మించారు. యాళ్ల రాములకు తారరెడ్డి, రేవతి రెడ్డి, నరేందర్ రెడ్డి ముగ్గురు సంతానం కలరు. రాములు 1990 దశాబ్దంలో ఆర్మూర్ ప్రాంతంలో చురుకైన రాజకీయపాత్ర పోషించారు. ఆర్మూర్ ప్రజలకు పలురకాలైన సేవా కార్యక్రమాలు చేపడుతూ నేనున్నానంటూ బడుగు బలహీన వర్గాల్లో ఆదర్శనీయమైన నేతగా ఎదిగారు.
ఈ క్రమంలో అప్పటి రాష్ట్రమంత్రి శనిగరం సంతోష్ రెడ్డి చొరవతో ఆర్మూర్ మండల ఎంపీపీగా 1994 సంవత్సరంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ ఎంపీపీగా పదవిలో ఉన్నసమయంలోనే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన యాల రాములు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగి 1996 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన మృతి చెందారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పుట్టపత్రికి వెళ్లివస్తుండగా కర్నూలు జిల్లాలోని పీచుపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి ఆర్మూర్ ఎంపీపీ యాలరాములు, ఆయన సతీమణి యాల రమాదేవి, కారు డ్రైవర్ రమా గౌడ్ లు సంఘటన స్థలంలోని మృతి చెందారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన పిల్లలు తారారెడ్డి, రేవతి రెడ్డి, నరేందర్ రెడ్డిను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. యల్లరాములకు స్వయాన మేనల్లుడు అయిన ఆశన్న గారి జీవన్ రెడ్డి మేనమామ రాజకీయ వారసుడిగా ఆర్మూర్ కేంద్రంగా రాజకీయం చేయడం 15 సంవత్సరాల కిందటనే ప్రారంభించాడు.
తొలిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీస్ చేసి మామకు తగ్గ మేనల్లుడు అంటూ ఆశన్న గారి జీవన్ రెడ్డి విజయ డంకా మోగించారు. అప్పటినుంచి ఆర్మూర్ జనం ఆశన్న గారి జీవన్ రెడ్డిని ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. 2018 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ జనం మద్దతుతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఆర్మూర్ అసెంబ్లీ చరిత్రలో ఏ నాయకుడు సైతం వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. అలాంటిది ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆశన్న గారి జీవన్ రెడ్డిని 2014, 2018 సంవత్సరంలో వరుసగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆర్మూర్ ప్రజలు గెలిపించుకొని అక్కున చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన మేనమామ యాళ్ల రాములు విగ్రహాన్ని ఆలూరు బైపాస్ రోడ్డు ప్రధాన చౌరస్తాలో ఈనెల 24వ తేదీన శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.