రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారు

by Sridhar Babu |
రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారు
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రీయ గీతంపై మాజీమంత్రి కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్టంలో బీఆర్​ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందని అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఅర్ నిండు సభలో చెప్పడం జరిగిందన్నారు. కేసీఆర్​ ప్రభుత్వంలో అన్నీ స్కాంలే జరిగాయన్నారు. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. నిజామాబాద్ పార్ల మెంట్ తో సహా 12 పార్ల మెంట్ స్థానాల్లో తాము గెలుస్తామని, కాంగ్రెస్ వేవ్ తో మా నేతలు గెలుస్తున్నారని జోష్యం చెప్పారు. రాబోయే పదేళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు.

ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, రాజ ముద్ర పై అన్ని పార్టీల నేతలతో చర్చించిన తరువాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ రావులే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఅర్ కు మానవత్వం లేదని, ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించామని, వస్తారా రారా అన్నది ఆయన విజ్ఞత కు వదిలేస్తాం అని అన్నారు. జూన్ లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తామని, అభివృద్ధి పై వరుసగా సమీక్షలు ఉంటాయన్నారు. బీజేపీ జూటా పార్టీ అని, మోదీ ప్రధాని గా చేసిన అభివృద్ధి చెప్పకుండా.. మత విద్వేషాలు రెచ్చగొట్టే లా ఎన్నికల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో పోలీస్ లు తమ పని తాము చేసుకుంటున్నారు అన్నారు. ఎంత మంది లోపలికి వెళ్తారు అన్నది త్వర లో తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎం ఎల్ ఏ భూపతి రెడ్డి, జిల్లా ఆధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణు, సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed