- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home Minister Anitha: విజిలెన్స్ విచారణ అంటే సుబ్బారెడ్డికి వణుకొస్తుంది: హోంమంత్రి అనిత మాస్ ర్యాగింగ్
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (Justice KV Viswanathan) సుప్రీం కోర్టు (Supreme Court) ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ (SIT)ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర సిట్ ఉంటేనే విచారణలో రాజకీయ జోక్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. విచారణకు స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని హోంమంత్రి అనిత మాస్ ర్యాగింగ్ చేశారు.