తన స్వంత ఫాంహౌజ్ పై కేవీపీ సంచలన నిర్ణయం

by M.Rajitha |
తన స్వంత ఫాంహౌజ్ పై కేవీపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మూసీ ప్రక్షాళన మీద సీఎం రేవంత్ రెడ్డికి(Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ(Musi) ప్రక్షాళనను, సుందరీకరణను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. తన ఫాంహౌజ్ లకు రెవెన్యూ అధికారులను పంపించి, సర్వే చేయించాలని కోరారు. అవి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నాయని తేలితే ఎలాంటి సంకోచం లేకుండా వాటికి మార్క్ వేయించాలని అన్నారు. ఆ నిర్మాణాలు అక్రమం అని తేలితే స్వంత ఖర్చులతో తానే కూల్చివేస్తానని ప్రకటించారు. కేవీపీ నిప్పు లాంటివాడని.. చెడ్డపేరు తేవడం అనేది తన కాంగ్రెస్ రక్తంలోనే ఉండదని తేల్చి చెప్పారు. సాధారణ పౌరుని విషయంలో చట్టం ఎలా ఉంటుందో.. అలాగే తన విషయంలో కూడా ఉండాలని సీఎంకు సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉండాలని, దానికి మీరు గాని నేను గాని అడ్డు చెప్పకూడదని అన్నారు. కాంగ్రెస్ నేతగానో, పార్టీలో సీనియర్ అనో ఎలాంటి మినహాయింపులు తనకు ఇవ్వకుండా రూల్స్ ప్రకారమే చేయండి అని తెలిపారు. మూసీ ప్రక్షాళన మంచి విషయం అని, పేదలకు ఎలాంటి నష్టం లేకుండా వారి బాగు కోసం చేపట్టే ప్రభుత్వ పనులను స్వాగతిస్తున్నాను అన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారని, వారిని పట్టించుకోవద్దని తెలియ జేశారు. పేదల కోసం చేసే మంచి పనులను దెబ్బతీసే విపక్షాల కుట్రలను ఖండిస్తున్నాను అని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed