Curry Leaves: కూరలో రోజూ వాడే కరివేపాకు గురించి ఈ 5 విషయాలు తెలుసుకోండి?

by Anjali |   ( Updated:2024-10-04 14:52:17.0  )
Curry Leaves: కూరలో రోజూ వాడే కరివేపాకు గురించి ఈ  5 విషయాలు తెలుసుకోండి?
X

దిశ, వెబ్‌డెస్క్: కరివేపాకును ఆహారంలో భాగం చేసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. కరివేపాకులో విటమిన్ A, B, C, E పుష్కలంగా ఉంటాయి. చుండ్రు అండ్ జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచడంలో కరివేపాకు తోడ్పడుతుంది. కరివేపాకులో ఉండే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఫాస్పరస్ వంటివి రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి, బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తాయి.

పైవన్నింటిని మించి కరివేపాకు కూరల రుచిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అనేక ఔషధ గుణాలు వీటిలో ఉంటాయి. ముఖ్యంగా కరివేపాకు ఐదు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జుట్టుకు మేలు చేస్తుంది, చర్మం గ్లోను పునరుద్ధరించడంలో ఉపయోగపడుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story