బాధ్యతగా పనులు చేపట్టాలి : అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

by Aamani |
బాధ్యతగా పనులు చేపట్టాలి :  అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
X

దిశ, ఆసిఫాబాద్ : చేపట్టిన పనులు బాధ్యతగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ హాస్పిటల్ లో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హాస్పిటల్ బిల్డింగ్ పనులకు సంబంధించి పనికిరాని సామాగ్రి ఇష్టానుసారంగా ఆవరణలో పడేయడం పట్ల కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ అపరిశుభ్రతతో పారిశుద్ధ్యం లోపించి రోగాలు ప్రబలే అవకాశం ఉందని.. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. అశుభ్రతకు కారణమై కాంట్రాక్టర్ కు రూ.10 వేల జరిమానా విధించించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

Next Story

Most Viewed