- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘సీఎం చంద్రబాబు చాలా అదృష్టవంతుడు’.. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ,వెబ్డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తనకు యాభై ఏండ్ల నుంచి తెలుసు అని ఆయనకు ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదని తెలిపారు. విశాఖలో ఇవాళ(శుక్రవారం) మాజీ మంత్రి చింతామోహన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చాలా అదృష్టవంతుడని అన్నారు. ఈ క్రమంలో దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)ను రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమే అని చింతా మోహన్ అన్నారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో ఉక్కు కార్మికులు వైజాగ్లో దీక్షలు మానేయాలని సూచించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 100 రోజులు అయినా ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తిరుపతి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యల పై చింతా మోహన్ మండిపడ్డారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి దేవాలయాలను తీసుకురావద్దని ఆయన సూచించారు.