BJP: అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

by Ramesh Goud |   ( Updated:2024-10-04 12:58:05.0  )
BJP: అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనలో పూర్తిగా విఫలమైందని, రికార్డ్ స్థాయిలో అప్పులు చేస్తూ.. గ్యారెంటీలు గాలికి వదిలేసిందని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు ఇలాగే ఉంటాయని, తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అప్పులతో "ఖాతా ఖట్ పథకాలు" అమలు చేస్తున్నారని చెబుతూ.. అప్పుల లెక్కలపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. దీనిపై తెలంగాణలో కాంగ్రెస్ దాని విఫల ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేసి, ఏ గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని అన్నారు.

డిసెంబర్ 2023లో అధికారం చేపట్టినప్పటి నుండి మార్కెట్ రుణాల ద్వారా రూ.72,000 కోట్లు తీసుకున్నారని, అది రోజుకు సుమారు రూ.241 కోట్లు అవుతుందని తెలిపారు. అలాగే 2024లో ఆర్బీఐ మార్కెట్ రుణాల పథకం ద్వారా రూ.7400 కోట్ల కంటే ఎక్కువ నిధులు సమీకరించబడ్డాయని వివరించారు. ఇలా రికార్డు స్థాయిలో రుణాలు తీసుకున్నప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు చేశారు. ఇక డిసెంబర్ 2023 నుండి 1 అక్టోబర్ 2024 వరకు ఖర్చు చేసిన నిధులు, సేకరించిన రుణాలపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.




Advertisement

Next Story

Most Viewed