- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BIG News: ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక గులాబీ బాస్..! తలసాని వియ్యంకుడి కోసం అనుమతులు
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీ వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ఉందని డాక్యుమెంట్లను సైతం విడుదల చేసింది. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణానికి లైన్ క్లియర్ చేశారని పేర్కొన్నది. ఇక బీఆర్ఎస్ హయంలో ప్రతిష్ఠాత్మకమని చెప్పుకున్న టీఎస్ఐపాస్ ద్వారా రెడ్ జోన్‌లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇచ్చారని, ఇందులో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ సంతకం కూడా ఉందని చెబుతూ దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
తలసాని వియ్యంకుడి కోసం పర్మిషన్
దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీ వ్యవహరంలో టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ కుమార్ ‘పీఎంకే డిస్టలరీస్’ కంపెనీలో 2016 నుంచి ఇప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పుట్టా సుధాకర్ స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వియ్యంకుడు. పీఎంకే డిస్టలరీస్‌లో తలసాని కుమారుడు తలసాని సాయి కిరణ్ సైతం కొన్ని నెలల పాటు అడిషనల్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఈ కంపెనీ దిలవవర్‌పూర్‌లో కేటాయించినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నారు. ఆయన బంధువుకు చెందినది కావడంతో ఈ కంపెనీకి అప్పటి సీఎం కేసీఆర్ అనేక రకాల మినహయింపులు ఇస్తూ డెసిషన్స్ తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. తలసాని ముందుండి కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రభుత్వం తరుఫున నడిపించినట్లు సమాచారం. కంపెనీ మంత్రి వియ్యంకుడిదే కావడంతో మంత్రివర్గ ఆమోదం లేకుండానే అనుమతులు ఇచ్చారు. అనేక అంశాల్లో ఉల్లంఘనలు ఉన్నా ‘మనదే కదా ప్రభుత్వం’ అన్నట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనల ఉల్లంఘన
కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులకు లబ్ధి చేసేందుకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. తలసాని కోసమే పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు సైతం రాష్ట్ర కేబినెట్‌ను ఒప్పించేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పారని, దీని వెనుక భారీగా గోల్‌మాల్, బంధుప్రీతి కారణమని ఆరోపణలున్నాయి.
బీఆర్ఎస్ బూమ్‌రాంగ్
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వ్యూహం ఎదురుతిరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఈ ఇష్యూను వాడుకోవాలని చూసిన బీఆర్ఎస్‌కు తాజా పరిణామాలు బూమ్‌రాంగ్‌గా మారుతున్నాయనే చర్చ జరుగుతున్నది. ‘అన్ని అనుమతులు మీ హయంలోనే ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తే ఎలా’ అని అధికార పక్షం రివర్స్ ఎటాక్ షురూ చేసింది.