- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: మణికంఠ కోసం భార్య నుంచి సర్‌ప్రైజ్.. కానీ పగతో యష్మీ ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు?
దిశ, వెబ్‌డెస్క్: 33 వ రోజుకు సంబంధించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా ఎమోషనల్ గా సాగింది. ఐదో వారం కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇస్తాడు. లేటెస్ట్ ప్రోమో చూసినట్లైతే.. టాస్క్ ఏం లేనట్లు కంటెస్టెంట్లంతా హౌస్‌లో ప్రశాంతంగా ఎక్కడివారు అక్కడే రెస్ట్ తీసుకుంటారు. ఇంతలో బిగ్‌బాస్ నిద్ర బాగా వస్తున్నట్లుంది లాలి పాట పాడమంటారా? అంటాడు. తర్వాత యష్మీని బిగ్ బాస్ కన్ఫషన్ గదికి రమ్మంటాడు. దీంతో వెంటనే లేచిన యష్మీ కన్ఫెషన్ రూమ్ కు వెళ్తుంది. నిఖిల్ అండ్ మణికంఠ ఇంటి వద్దనుంచి ఫుడ్ వస్తుంది. ఈ ఫుడ్ యష్మీ నిర్ణయించి ఎవరో ఒకరికే (మణికంఠ లేదా నిఖిల్) ఇవ్వాలి.
కానీ తను మణికంఠ మీద కోపంతో నిఖిల్ పేరు చెబుతుంది. దీంతో బిగ్‌బాస్ మణికంఠ గురించి ఏం ఆలోచించాలని అనిపించట్లేదా? అంటాడు. దీనికి యష్మీ నేను నిఖిల్ కే ఇస్తాను బిగ్ బాస్ అంటుంది. పాపం మణికంఠ తలపట్టుకుని ప్లీజ్ యష్మీ అని బతిమిలాడుకుంటాడు. అయితే మణికంఠ ఇంతలా బాధపడడానికి కారణం ఏంటంటే..? ఆ ఫుడ్ పంపింది తన భార్య శ్రీప్రియ కాబట్టి. నాకు నా భార్య పంపిన మెసేజ్ చాలా అవసరం యష్మీ అని బాధతో గట్టిగా అరిచిన కూడా ఆమె పట్టించుకోదు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అంతా ఎమోషనల్ అవుతారు. తర్వాత నాగ మణికంఠ గార్డెన్ ఏరియాలోకి వెళ్లి ఐ లవ్ యూ ప్రియ అంటూ అరుస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.