Lagacharla : లగచర్ల ఘటనలో కీలక నిందితుడు సురేష్ కు బెయిల్

by Y. Venkata Narasimha Reddy |
Lagacharla : లగచర్ల ఘటనలో కీలక నిందితుడు సురేష్ కు బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల Lagacharlaలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ క్రమంలో కలెక్టర్, అధికారులపై దాడి(Attack on Collector)కి పాల్పడిన ఘటనలో ఏ2 నిందితుడిగా ఉన్న బోగమోని సురేష్(Sures) కు ఎట్టకేలకు బెయిల్(Bail) లభించింది. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని ఇంచార్జి ఏసీబీ కోర్టు జడ్జి అఫ్రోజ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి సోమ, శనివారం సబ్‌ డివిజనల్‌ పోలీసు ఆఫీసర్‌ తాండూర్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 1 గంటలోపు సంతకం చేయాల్సి ఉంటుందని సూచించారు. మూడు నెలలపాటు ఎస్‌డీపీఓ అధికారి ఎదుట విచారణకు సహకరించాలని తెలిపారు. నిందితుడు పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లయితే కోర్టుకు సరెండర్ చేయాలని పేర్కొన్నారు. 50 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్న ముద్దాయి తరఫు న్యాయవాది ఏకాంబరం చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ్యానాయక్‌, బుగ్గప్పలకు సైతం బెయిల్‌ మంజూరు చేసింది. వీరిద్దరూ రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను కోర్టుకు జమ చేయాలని, ప్రతి బుధవారం ఎస్‌డీపీఓ అధికారి తాండూర్‌ ఎదుట హాజరుకాలని తెలిపింది. లగచర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి ఘటనలో బొంరాస్‌పేట్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఏ1గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సైతం కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు 14మంది నిందితులకు బెయిల్ లభించింది.

Advertisement

Next Story