GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఇద్దరు కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |
GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఇద్దరు కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు(GHMC Contractors) ఆందోళన చేస్తున్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పలువురు వారి వద్ద నుంచి పెట్రోల్ బాటిళ్లను లాక్కొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(Commissioner Ilambarithi).. కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిరసన ఆపారు. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లను పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిద్ద‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట‌ర్ల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story