- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala:‘తొక్కిసలాటకు అసలు కారణం ఇదే’.. ప్రత్యక్ష సాక్షి కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టోకెన్ల జారీకి తిరుపతి (Tirupati)లోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. బైరాగి పట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన పై ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. అధికారులు గేట్లు తెరవగానే క్యూలైన్ లోని భక్తులు ఆత్రుతగా తోసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఎంత ఆపినా ఎవరూ ఆగలేదని ఆమె చెప్పారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం టికెట్లు ఇస్తామని అధికారులు చెబుతున్నా వినిపించుకోలేదని పేర్కొన్నారు. ఏవో వైర్లు చుడుతుండగా తమ కోసమే గేట్లు తెరిచినట్లు భావించారని ఆమె చెప్పారు. ఇందులో భద్రతా సిబ్బందిని అనడానికి ఏమీ లేదని, వచ్చిన భక్తుల్లో కంట్రోల్ లేదని ఆమె అన్నారు. పురుషులు కూడా మహిళలు, పిల్లలు ఉన్నారని చూసుకోవడం లేదని తోసుకుంటూ వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటన పై మరి కొందరు పోలీసుల వైఫల్యమే కారణమని చెబుతున్నారు.