Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్

by Shamantha N |
Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్‌ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సివిల్‌ లైన్స్ ఏరియాలో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని నివాసం నుంచి తన కుటుంబంతో కలిసి ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఆయన ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. కాగా.. పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని బంగ్లాలో ఇకపై కేజ్రీవాల్ నివాసం ఉండనున్నారు. పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ కు అధికారికంగా కేటాయించిన బిల్డింగ్ లో కేజ్రీవాల్ ఉండనున్నారు. అది ఫిరోజ్‌షా రోడ్డులో ఉంది.

సీఎం పదవికి రాజీనామా

ఇకపోతే, ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి బెయిల్ పై కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. దాంతో సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నట్టు ఇటీవల పార్టీ కార్యకర్తలకు కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. తమ ఇంటికి రావాలని, తమతో ఉండిపోవాలని పలువురు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఆయన్ని కోరారు. ఇకపోతే, 2013లో తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన తిలక్‌ లేన్‌లో ఉండేవారు. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులోని ఇంటికి మారారు.

Next Story

Most Viewed