- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మూడోసారి రికార్డ్ బద్దలు కొడతారు
దిశ, నిజామాబాద్ సిటీ : అభివృద్ధి కళ్ల ముందు కనపడుతుందని, నిజామాబాద్ ను అభివృద్ధి చేసిన గణేష్ బిగాలను భారీ మెజారిటీతో మూడో సారి గెలిపించండని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని అర్బన్ నామినేషన్ కేంద్రం వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గణేష్ బిగాల రెండవ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో బీ ఆర్ ఎస్ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలువనున్నారని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ రికార్డు బద్దలు కొట్టనుందని అన్నారు. విమర్శలకు పరిమితమైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాయన్నారు. నిజామాబాద్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బిగాలకి ప్రజలు పట్టం కట్టనున్నారని,
మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలకు కాదని అన్నారు. అభివృద్ధిలో గణేష్ బిగాలకు ఎవ్వరూ సాటి రారని అన్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ.. మూడో సారి గెలిపిస్తే నిజామాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లు ఏలినా నిజామాబాద్ అభివృద్ధి చెందలేదని, పదేళ్లలో నిజామాబాద్ రూపురేఖలు మార్చామని, నిజామాబాద్ లో ఐటీ హబ్, జిల్లా కలెక్టరేట్, మినీ ట్యాంక్ బండ్, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేశామన్నారు. ఇవే కాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని, మూడోసారి గెలిపిస్తే ఐదేళ్లు ప్రజలకు సేవ చేస్తానన్నారు. అంబాసిడర్ కారులో ఇంటి నుంచి ఎమ్మెల్సీ కవితతో రావడం సెంటిమెంట్ అని, ఈసారి కూడా గెలవడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సాయి వర్ధన్, బీఆర్ఎస్ నాయకులు మాయ వారి సాయిరాం, సాంగ్ బాయ్ మంజుల యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.