- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి వస్తే రూ. 500 గ్యాస్ సిలిండర్..
దిశ, భిక్కనూరు : జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తామని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన 30 మంది యువకులు, ఫామ్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాడని, ఆ మేనిఫెస్టోను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఇక్కడ కూడా అమలుచేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ పై ఉన్నమిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఫైల్ పై సంతకం పెడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ ను ఇంట్లో ఉన్న అర్హులందరికీ ఇచ్చామని, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే చాలు అన్న ధోరణిలో పెన్షన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చే విధంగా దృష్టి పెడతామన్నారు. పార్టీలో చేరిన వారితోపాటు, ప్రతి ఒక్కరూ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.