Kamareddy : సెక్స్ రాకెట్‌లో పొలిటికల్ హస్తం..?

by Aamani |
Kamareddy : సెక్స్ రాకెట్‌లో పొలిటికల్ హస్తం..?
X

దిశ,కామారెడ్డి : ‘కామారెడ్డిలో జరిగే వ్యభిచారంపై దిశ పత్రికలో వార్త మస్తు రాస్తున్నారు అన్నా. నిజంగా ఎంతో మంది అమాయక మహిళలు ఇందులో కూరుకుపోయారు. కానీ ఈ విషయంలో అంత డెప్త్ కి పోవడం సరికాదేమో. ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్లే వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారు. పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని మాకు ఈ మధ్యనే తెలిసింది' దిశ పత్రికలో వచ్చిన వార్తలను చూసి కొందరు సామాన్య ప్రజలు దిశ ప్రతినిధితో చెప్పిన మాటలివి.. ఎక్కడ చూసినా దిశ పత్రికలో వచ్చిన కథనాలపై చర్చించుకుంటున్నారు. కామారెడ్డిలో ఇంత జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రెండు రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్న వ్యభిచారం దందాపై దిశలో వస్తున్న కథనాలు కామారెడ్డిలో కలకలం రేపుతున్నాయి.

పొలిటికల్ హ్యాండ్ ఉందా..?

కామారెడ్డి కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్ దందాలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ సెక్స్ రాకెట్ విషయం అధికారులకు తెలిసే జరుగుతుందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వ్యాపారంలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టుగా ప్రచారం సాగడం హాట్ టాపిక్ గా మారుతోంది. కామారెడ్డిలో అసలేం జరుగుతోంది అనే చర్చ నడుస్తోంది.

అనుచరులతో మెయింటెనెన్స్

కామారెడ్డి నాలుగు జిల్లాల కూడలి కావడంతో ఇక్కడ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రత్యేకంగా పట్టించుకునే సమయం ఎవరికీ ఉండదు. ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతుంటారు. సెక్స్ వ్యాపారం నిర్వహించే బ్రోకర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నాయకుల హస్తం ఉందన్న ప్రచారం సాగుతుండగా వారి అనుచరులకే ఈ దందా మెయింటెనెన్స్ అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల వెలసిన పోస్టర్లలో సైతం అనుచరుల ఫోన్ నంబర్లే ప్రింట్ చేయించి వారి ద్వారానే అమ్మాయిల సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో నాయకుల పేర్లు బయటకు రావన్నది వారి ఆలోచనగా ప్రచారం సాగుతోంది.

రోజుకు రూ. 50 వేలకు పైగా ఆదాయం..?

జిల్లా కేంద్రంగా ప్రధాన కూడళ్లలో సాగుతున్న ఈ దందాలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరు తున్నట్టుగా తెలుస్తోంది. గంటకు 500, రోజుకు 2 వేలు చొప్పున వసూలు చేస్తూ రోజుకు 50 వేలకు పైగా ఆదాయం ఈ వ్యాపారం ద్వారా వస్తున్నట్టుగా తెలుస్తోంది. మహిళలతో సాన్నిహిత్యం కోరుకునే విటులు ఎక్కువగా గంట మాత్రమే గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎక్కువ మంది విటులు వచ్చే అవకాశం ఉండటంతో ఆదాయం రెట్టింపు అవుతున్నట్టుగా సమాచారం. దాంతో మహిళలను డబ్బుకు బానిసలుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed