- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
దిశ, పిట్లం : కురుస్తున్న వర్షాలకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాష్ట్ర వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా పిట్లం మండల తహశీల్ కార్యాలయంలో ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని కురుస్తున్న భారీ వర్షాల పై ఉన్నతాధికారుల సూచనలను విన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులకు కురుస్తున్న భారీ వర్షాల పై అధికారులు తీసుకోవాల్సిన చర్యల పై దిశా నిర్దేశం చేశారు.
మండలంలో గల లోతట్టు ప్రాంతాల వివరాలను తాసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ రాజును మండలంలో జరుగుతున్న పరిస్థితుల పై వివరాలు తెలుసుకొని సమస్యల పై ఎలా స్పందించాలో వివరించారు. మండలంలో గల పురాతనమైన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని మండల అధికారికి సూచించారు. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎవరు కూడా రోడ్ల పై రావద్దు అని ప్రబలుతున్న రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంబడి పిట్లం మండల అధికారులు ఉన్నారు.