సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శం..

by Sumithra |
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శం..
X

దిశ, జుక్కల్ : సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే అన్నారు. మండలంలోని సావర్ గాం గ్రామంలో కౌలాస్ డ్యాం వద్ద నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్యే సిందే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన అన్నారు. రైతుబంధు కింద ఎన్నో కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమవుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన అన్నారు. ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు, మురికి కాలువల పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

కేసీఆర్ కిట్టుతోపాటు 12 వేల రూపాయలు అందిస్తున్నారని ఆయన అన్నారు. రైతుబంధు నిధులు కూడా బ్యాంక్ అకౌంట్లో జమఅవుతున్నాయని ఆయన అన్నారు. రైతు బీమా, దేశంలో ఏ ప్రభుత్వం చేయని పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సవర్ గాం సర్పంచ్ కిషన్ పవర్, వైస్ ఎంపీపీ ఉమాకాంత దేశాయ్, మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, బీఆరఎస్ మండల అధ్యక్షులు మాధవ దేశాయ్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, అనిత సింగ్, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గంగు నాయక్, ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు గ్రామఅధ్యక్షులు కార్యదర్శులు వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed